అడ్డంగా దొరికిపోయాడు..! భార్య పొట్టిగా ఉందని వేరే మహిళతో రాసలీలలు. చివరకు కథ అడ్డం తిరిగింది
జనం న్యూస్: వేరే మహిళతో ఉండగా భార్యకు అడ్డంగా దొరికిపోయాడు ఓ భర్త. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం స్పా లో పరిచయం అయిన యువతికి అక్రమసంబంధం పెట్టుకున్న భర్త..భార్యను కాదని.. ప్రియురాలితో పార్కులు, బీచ్లు, హోటల్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆమెకు విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. భర్తపై అనుమానం వచ్చి ఫాలో చేయగా బండారం వెలుగులోకి వచ్చింది. 2020 డిసెంబర్ 17న వివేక్ కు హరితతో పెళ్లి అయింది. హరిత ది చోడవరం దరి ఎల్ సింగవరం కాగా.. వివేక్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందినవాడు. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. భార్య పొట్టిగా ఉందని విడాకులు ఇవ్వడానికి సిద్దపడ్డాడు భర్త. పెళ్లయిన 3 నెలలు తర్వాత స్పా లో మాధురి మధు పరిచయమైందట. పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధం దారి తీసిందని సమాచారం. దీంతో ప్రియురాలితో పార్కులు, బీచ్లు, హోటల్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆమెకు విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడట. అయితే.. తాజాగా వివేక్, మాధురిలను అడ్డంగా దొరకబట్టి.. చితకబాదింది హరిత.