ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలు ఉన్నాయో కనిపెట్టండి చూద్దాం..!
జనం న్యూస్: కొన్ని రకాల చిత్రాలు అత్యద్భుతంగా ఉంటాయి. పైగా వాటిలో దాగి ఉన్న అసలైన చిత్రాలను మనం తదేకంగా పరికించి చూస్తే గానీ గుర్తిచలేం. అయితే అలా గుర్తించడం కూడా ఒక అందమైన అనుభూతి అనే చెప్పాలి. కొంతమంది కళాకారులు భలే అద్భుతంగా గీస్తారు. అవి చూసినప్పుడు ఒకలా ఉంటుంది. కానీ కాస్త నిశితంగా పరిశీలించి చూస్తే అసలైన కళాఖండం అవగతమవుతుంది. అచ్చం అలానే ఉంటుంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం కూడా. అసలు విషయంలోకెళ్లితే...మంచు పర్వతాల్లో గుర్రాల గుంపు నిలబడి ఉన్న ఒక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటగా మనకు ఆ చిత్రం చూసిన వెంటనే అక్కడ ఐదు గుర్రాలు మాత్రమే ఉన్నాయని అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఏడు గుర్రాలు ఉంటాయి. మనం ఒక్కసారిగా పరికించి జాగ్రత్తగా చూస్తేగానీ మనకు అవగతమవ్వదు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూసి ఎన్ని గుర్రాలు ఉన్నాయో లెక్కపెట్టండి మరి. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి.