అవసరమా అక్కా నీకు ఈ ఆటలు.. ఏనుగు ముందు వేషాలు వేసింది.. అది ఈడ్చి కొడితే ఎగిరి పడింది.

జనం న్యూస్: అరటి పండు అంటే మనకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ ఏనుగు ముందు అరటి పండు కనిపిస్తే అంతే సంగతి. గెలలు గెలలకే లాగించేస్తాయి. అందుకే చాలా మంది ప్రజలు ఏనుగులకు అరటి పండ్లను ఆహారం అందిస్తుంటారు. వాటిని తిని అవి సంతోషిస్తాయి. తాజాగా ఓ యువతి భారీ ఏనుగుకు అరటి పండు తినిపించడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో ఏనుగుతో కాస్త ఆడుకోవాలని భావించింది. కానీ, ఏనుగు ముందు ఆమె ఆటలు సాగలేదు. చివరకు ఏనుగు ఇచ్చిన షాక్‌కి బిత్తరపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ యువతి సరదాగా అరటి పండ్లను ఏనుగుకి తినిపించాలని ప్రయత్నించింది. అయితే, ఏనుగు ఆమెను సమీపించగానే అరటి పండ్లతో దోబూచులాడింది. ఇంకేముంది.. ఆ ఏనుగుకి బాగా కలింది. ఆడుకుంటున్నట్లుగానే దగ్గరకు వచ్చి.. ఒక్కసారిగా తొండంతో యువతిని నెట్టేసింది. దెబ్బకు గింగిరాలు తిరుగుతూ కింద పడిపోయింది అమ్మడు. ఏనుగు ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. కాగా, ఈ సీన్‌ను అంతా ఆమె వెంట వచ్చిన వ్యక్తులు తమ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఆమె చేసిన పనికి చివాట్లు పెడుతున్నారు. ఏనుగుతో పరిచికాలు మంచిది కాదని హితవు చెబుతున్నారు.