గేద ముందు ఇన్స్టాగ్రామ్ వీడియో కి డాన్స్ వేసింది.. గేదె ఎగిచ్చి తన్నింది పాపం..
జనం న్యూస్: ఇదివరకు ఇన్‌స్టాగ్రామ్‌ని సెలబ్రిటీలు మాత్రమే వాడేవాళ్లు. టిక్‌టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యాక.. సామాన్యులు సైతం ఇన్‌స్టాగ్రామ్‌ని వాడటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో పల్లెపల్లెకూ ఇన్‌స్టాగ్రామ్ విస్తరించింది. ఈమధ్య రీల్స్ ప్రవేశపెట్టాక.. చాలా మంది వాటిని చేస్తున్నారు. తమ టాలెంట్ చూపిస్తున్నారు. అదే విధంగా... ఓ పల్లెటూరి యువతి బాలీవుడ్ దేవదాస్ సినిమాలోని మార్ డాలా సాంగ్ కి రీల్ చెయ్యాలి అనుకుంది. అందుకు ఏ ప్లేసూ దొరకనట్లు.. ఓ గేదె ముందు రీల్ చేయడం మొదలుపెట్టింది. ముందుగా గేదెకు దాణా వేసింది. తర్వాత డాన్స్ మొదలుపెట్టింది. అది చూసిన ఆ గేదె కంగారుపడింది. ఆమె ఏదో చేస్తోందనే టెన్షన్‌తో ఒక్కసారిగా దాడి చేసింది . దాంతో ఆ యువతి... వెనక్కి పడిపోయింది. ఇలా సాంగ్ రీల్ కాస్తా.. ఫన్నీ రీల్ అయిపోయింది. ఈ వీడియో క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్ లోని psycho_biharii2 పేజీలో జులై 4న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ దీనికి 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 22 వేల మందికి పైగా లైక్ చేశారు. దీన్ని చూసి నెటిజన్లు నవ్వుతున్నారు.