అసలు ఎలా సాధ్యం అండి ఇది..! ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు అసలు. (వీడియో చూడండి)
జనం న్యూస్: దేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి.. ప్రతీ ఒక్కరూ తమలోని క్రియేటివ్ థాట్స్‌ని ఇంటర్నెట్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఒకరు వాడకంలో లేని కూలర్‌ను ఏసీగా మారిస్తే.. ఇంకొకరు కారును హెలికాప్టర్‌గా చేస్తే.. మరొకరు శ్రమను తగ్గించేందుకు వెరైటీ టెక్నిక్స్ కనిపెడుతున్నారు. వీటికి నెట్టింట లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చిపడుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ యువకుడు తన పల్సర్ బైక్‌కు ఏకంగా ట్రాక్టర్ చక్రం అతికించి మరీ జెట్ స్పీడ్‌లో పోనిచ్చాడు. ఈ వీడియోను 'hussain_tarana' అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ వ్యక్తి పల్సర్ బైక్‌ను వేగంగా పరుగులు పెట్టించాడు. ఇక అతడు నడుపుతోన్న బైక్ వెనుక చక్రం.. పెద్దగా ఉంది. ఇంతకీ ఆ చక్రం దేనిది అంటారా.? ఓ ట్రాక్టర్ చక్రం.. అవునండీ.! ఆ వ్యక్తి తన పల్సర్ బైక్ వెనుక చక్రం తీసేసి.. దాని ప్లేస్‌లో ట్రాక్టర్ చక్రం అమర్చాడు. ఆ చక్రంతో తన పల్సర్ బైక్‌పై రయ్.. రయ్.. అంటూ వేగంగా పోనిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని వాళ్ళ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చిపడుతున్నాయి. కొందరు ఇది 'పల్సర్ కొత్త మోడల్' అని అంటుంటే.. ఇంకొందరు.. 'అంతటి వేగం ప్రమాదకరం' అని కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.