లైకుల కోసం వీడియో తీస్తూ డ్యాములోకి వెళ్ళారు.. కళ్ల ముందే కొట్టుకపోయి చనిపోయారు (వీడియో చూడండి)
జనం న్యూస్: కొంత మంది యువత ఇటీవల మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదైన చేసి ఫెమస్ అయిపోవాలని వెర్రి చేష్టలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో వీడియోలు, రీల్స్ లు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. అందుకే చాలా మంది యువత.. ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోవాలని, ఏదేదో చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పడేస్తున్నారు. కొంత మంది బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, మెట్రోలు, ఎయిర్ పోర్టులు ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకుంటూ, వింతగా ప్రవర్తిస్తున్నారు. జలపాతాలు, అడవులు, కొండ ప్రాంతాలకు వెళ్లియువత ఎక్కువగా రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో చాలా మంది ఎత్తైన కొండలు, జలపాతాలు చూసేందుకు వెళ్తున్నారు. అక్కడ రీల్స్ తీసుకొనే క్రమంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. రీల్స్, వీడియోలు తీసుకునే క్రమంలో ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న కూడా.. సెకన్ లలో దారుణ ఘటనలు జరిగిపోతుంటాయి. ఈ కోవకుచెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కాలామ్న ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఆకాశ్ చకోలే.. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో..తన మిత్రులతో కలిసి.. మకర్ ఢోక్డా డ్యామ్ ను చూసేందుకు వెళ్లారు. కొన్నిరోజులుగా వర్షం కురుస్తుండటంతో ఆ ప్రాంత మంతా నీళ్లతో అందంగా కన్పిస్తుంది. డ్యామ్ నిండిపోయి.. అలుగు పారుతుంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్..తన స్నేహితులతో కలిసి డ్యామ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు.ముగ్గురు కలిసి నీళ్లుపడుతున్న కూడా.. డ్యామ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆకాశ్ ఒక్కడే డ్యామ్ పైకి ఎక్కాడు. కానీ ఇంతలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకాశ్.. అనూహ్యంగా బ్యాలెన్స్ కోల్పోయి.. డ్యామ్ లో పడిపోయాడు. మరో ఇద్దరు స్నేహితులు కిందకు పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా భయంతో అరుపులు, కేకలు వేశారు. కానీ చూస్తుండగానే.. ఆకాశ్ మాత్రం డ్యామ్ లో పడిపోయి కొట్టుకొని పోయాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వెతికిన ఫలితంలేకుండా పోయింది. కొన్ని గంటల తర్వాత మాత్రం అతని డెడ్ బడీనా పోలీసులు కనుగొన్నారు.ఈ షాకింగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు.. ఇలాంటి రీల్స్అవసరమా.. అంటూ తిట్టిపోస్తున్నారు.