;ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

;ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ :2 సెప్టెంబర్: సోమవారం: సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి:జనసేన పార్టీ సిద్దిపేట నియోజికవర్గo కో ఆర్డినేటర్ , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్  జన్మదిన సందర్బంగా ఉదయం  వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి  అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ,అభయ జ్యోతి మానసిక దివ్యాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమలు, మహిళలకు చీరలు పంపిణి చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తదాన శిభిరం నిర్వహించడం జరిగిoది.ఈ సందర్బంగా దాసరి పవన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ జన్మదినo ప్రత్యేకమైనది ఏందుకంటె మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలలో నీతి నిజాయితీ ఒక్క పైసా పంచకుండా ఒంటి చేత్తో కూటమిని గెలిపించి జనసేన పోటీ చేసిన 21 శాసనసభ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి దేశ చరిత్రలో ఏ పార్టీ కి దక్కని వంద శాతం స్ట్రెయిక్ రేట్ కేవలం జనసేన పార్టీ కి పవన్ కళ్యాణ్ కు మాత్రమే దక్కిందాన్నారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. తెలంగాణా లో రానున్న రోజులలో పార్టీని గ్రామ గ్రామాన గడప గడపకి పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లి నీతి  నిజయితీ తో కూడిన రాజకీయాలు చేసి తెలంగాణా లో  జిహెచ్ఎంసి మరియు స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీ తరుపున నిలబడ్డ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో బండిపల్లి కృష్ణ. భానుచందర్ గౌడ్. సిరి.చరణ్ గౌడ్.షాదుల్ల.బాలు. నరేష్.హైమద్. అఖిల్. తరుణ్. దీరజ్. నితీన్ సాయి. సూర్య.లక్ష్మణ్. రాము. రజినీకాంత్ .జనసేన నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.