భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

పిఏసిఎస్ చైర్మన్ మారుతి రెడ్డి,

జనం న్యూస్,సెప్టెంబర్ 02,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి మండల  పిఏసిఎస్ చైర్మన్ మారుతి రెడ్డి, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల  ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని అన్నారు.గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని,మరో రెండు రోజుల పాటు   వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగిందని అన్నారు. వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు,ఇనుప స్తంభాలను తాకకుండా జాగ్రత్తగా ఉండాలని మండల ప్రజలకు విన్నవించారు.ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు తిరగనివ్వకుండా చూసుకోవాలని అన్నారు.రైతులు వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్తంభాలను, తీగలకు దూరంగా ఉండాలన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు,చెరువుల, వద్దకు వెళ్లొద్దని అన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో ఉండే ప్రజలు,తగు జాగ్రత్తలు తీసుకోవాలనారు. డ్రైనేజీ కాలువలు, వాగులు వంకల,వద్దకు ప్రజలు వెళ్ళకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.