మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 40వ వర్ధంతి వేడుకలు
జనం న్యూస్ నవంబర్ 1 శాయంపేట మండల కేంద్రంలోని
పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి, ప్రపంచ దేశాల అగ్రనాయకుల మన్ననలు పొందిన ఉక్కుమహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు గురువారం ఇందిరాగాంధీ 40వ వర్ధంతి సందర్భంగా శాయంపేట, మండల కేంద్రాంలో మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, ఇందిరాగాంధీ చిత్ర పటాన్నికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. వారి రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని శక్తివంతమైన నాయకురాలిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరూపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు.., నేటి తరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ (బుజ్జన్న)మాజీ జేడ్పీ చైర్ పర్సన్ చల్ల చక్రపాణి పోల్లపెల్లి గ్రామ అధ్యక్షులు చింతల రవిపాల్ ఉపాధ్యక్షులు మాలపల్లి కటయ్య శ్రీనివాస్ రెడ్డి నాయకులు చిందం రవి దుబసి కృష్ణమూర్తి గ్రామ కార్యదర్శి మాలపల్లి వరుద రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.....