ఆర్మీలో ఉద్యోగం సాధించిన విద్యార్థులు

ఆర్మీలో ఉద్యోగం సాధించిన విద్యార్థులు

జనం న్యూస్ 29 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

విశాఖపట్నంలో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు పోస్ట్ స్టేడియంలో అగ్ని వీర్ ఫైనల్ ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించబడినది. అందులో భాగంగా విజయనగరం డిఫెన్స్ మరియు పోలీస్ అకాడమీ విద్యార్థులు 10/19 ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ఇందులో భాగంగా ఎక్స్- ఎన్ ఎస్ జి కమాండో డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. యువతని ఎప్పుడు మంచిదారిలో పెడతానని, యువతకి ఎప్పుడూ అండగా ఉంటానని, వాళ్లు సాధించిన ప్రతి మంచి విషయంలో తోడుగా ఉంటానని. ఉద్యోగం వచ్చిన ఇంట్లో దీపం వెలిగిస్తున్నానని ఆయన ఆనందభాష్పాలతో గర్వపడుతున్నారు. అలాగే ఇంకా విజయనగరంలో ఉన్న యువతని తప్పుదోవ పట్టకుండా సైనికులుగా తీర్చిదిద్దాలని కృషి చేస్తాను అని కొనియాడారు.