*ఇంటికి మూల స్తంభం మహిళలే
జనం న్యూస్ 01 అక్టోబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మహిళా సాధికారత అంటే ఆర్థికంగా ఉండడమే కాదు ఆరోగ్యాంగా కూడా.ఉండాలి...అప్పుడే దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండగలం....
మహిళలకు పోషణ, పోషకహారం, పరిశుభ్రత పై అవగాహన కల్పించడం అత్యంత అవసరం...ప్రతీ మహిళా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి..మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా బలంగా ఉండడమే కాదు ఆరోగ్యాంగా కూడా ఉండాలని అప్పుడే దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండగలమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు.
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ....*
మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం మరియు పోషకాహార లోపాలపై అవగహన కల్పించారు. పౌష్టిక ఆహార లోపం వల్ల రక్త హీనత, జనన శిశువు బరువు తగ్గుదల మొదలగు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని చెప్పారు.గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఎలాంటి పోషకాహర లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలని, ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే బిడ్డకు ఆహారంగా ఇవ్వాలని, తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహద పడతాయన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను సమయానికి అందజేయాలని అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్త్ వర్కర్లకు సూచించారు. పోషకార లోపాలను అదిగమించడానికి అంగన్వాడీ వర్కర్లు మహిళలలో అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.
*ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ....*
మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పోషణ, పోషకహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అభినదనీయమని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని పనులు సమర్థవంతంగా చేసుకోగలమని అన్నారు. మహిళలల్లో రొమ్ము క్యాన్సర్, గర్భశాయ క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని లేకపోతే ప్రణాంతకం అయి ప్రాణాలకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. మహిళలు ఎలాంటి భయందోళనలు లేకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణీస్త్రీలు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.