కప్పను చంపి సాంబార్ వండి ఆ తరువాత ఎం చేశాడు అంటే.. !

కప్పను చంపి సాంబార్ వండి ఆ తరువాత ఎం చేశాడు అంటే.. !

జనం న్యూస్: మనుషులు చూడగానే చీదరించుకునే జీవులలో కప్ప కూడా ఒకటి అని చెప్పాలి. ఎందుకంటే దాని ఆకారం చూస్తేనే ఎందుకో మనుషులకు వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కప్ప మన దగ్గరికి వస్తుంది అంటే చాలు ఎంతోమంది దూరంగా జరుగుతూ ఉంటారు. అలాంటిది చూడ్డానికి ఇష్టపడని కప్పను చేతితో పట్టుకోవడం అంటే అది మాట్లాడుకోవడానికి కంపరంగా ఉంది అని అంటూ ఉంటారు జనాలు. ఇక ప్రతి ఒక్కరికి కూడా కప్ప విషయంలో ఇలాంటి భావనే ఉంటుంది. అది సరేగాని గురు.. ఇప్పుడు ఈ కప్పలో పంచాయతీ ఎందుకు అని అనుకుంటున్నారు కదా.. కప్ప గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అని భావిస్తున్నారు కదా.. ఇందుకు కారణం ఏంటో తెలుసా.. కనీసం చేత్తో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని కప్పతో.. ఇక్కడ ఒక వ్యక్తి సాంబార్ చేశాడు. ఇది వినడానికే యాక్ అనిపించేలాగే ఉంది కదా. కేవలం సాంబార్ చేయడమే కాదు ఇంటిల్లిపాదికి ఆ కప్పతో చేసిన సాంబార్ వడ్డించాడు. పాపం వాళ్లకు తెలియదు కదా అది పప్పు సాంబార్ కాదు కప్ప సాంబార్ అని. దీంతో సాంబార్ ఏదో కొత్తగా టెస్ట్ ఉంది అని ఒక ముద్ద ఎక్కువే తిన్నారు. కానీ ఆ తర్వాతే అసలు తంటాలు మొదలయ్యాయి. ఈ ఘటన ఒడిస్సా లోని కియాం జోర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కప్పను చంపి దానితో సాంబార్ చేసిన వ్యక్తి దాన్ని ఇద్దరు పిల్లలు సహా కుటుంబ సభ్యులందరికీ అన్నంలో వడ్డించాడు. దీంతో అది తిన్న కుటుంబ సభ్యులు వాంతులు చేసుకొని స్పృహ తప్పి పడిపోయారు. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే వారికి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయింది. ఇక మరో నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.