కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం..
రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ప్రతినిధి దినేష్
తెలంగాణ విమోచన దినోత్సవం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం అర్షణీయమని,అధికారికంగా ప్రతి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగర వెయ్యాలని,నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు ,మహిళల మీద జరిగిన దాడులు,ఎందరో నిజాం కు వ్యతిరేకంగా పోరాడన్నారు.. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం కేంద్రం అధికారంగార్వహిస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో... తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు జరప లేదని అన్నారు.గత ప్రభుత్వంలో కేసీఆర్ సమైక్యత దినోత్సవం అంటే..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటుందన్నారు.గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదన్నారు.విమోచన దినోత్సవానికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్..ఆయన నిజాం మెడలు వంచి తెలంగాణ ప్రజల విముక్తి కల్పించారు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజరాజు, మాజీ ఎంపిటిసి గుండెల శ్రీనివాస్,రాజిరెడ్డి,బాల్ రెడ్డి,ఎల్సాని దేవయ్య,బాలసాని శ్రీనివాస్ గౌడ్, వేముల సత్యం గౌడ్,తలారి నరసింహులు,భాను, గోవర్ధన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు