*దళిత బంధు పేరు చెప్పిలక్షలు,దండుకున్న బిఆర్ఎస్ దళారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.*.
జనం న్యూస్ 02 అక్టోబర్ 2024 జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు "ఎస్ మద్దిలేటి" డిమాండ్.
????గత బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకాన్ని ఇప్పిస్తామని కొందరు బిఆర్ఎస్ దళారులు అలంపూర్ తాలూకాలో లక్షల రూపాయలు దండుకొని దళితులను మోసంచేశారని ..ఎఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐజ మున్సిపాలిటీ కేంద్రం పాత బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన *ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్ మద్దిలేటి గారు* బిఆర్ఎస్ దళారులపై బిఆర్ఎస్ పార్టీ పై విరుచుకుపడ్డారు.
????ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ... దళిత బంధు పేరు చెప్పి సామాన్య దళిత సోదరుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి దళిత జాతిని మోసం చేసిన బిఆర్ఎస్ నాయకులను దళారులను సంబంధిత జిల్లా కలెక్టర్ ,ఎస్పీ గార్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
????దళిత బందు పేరుపై వచ్చిన అరకొర కొన్ని యూనిట్లను టిఆర్ఎస్ లీడర్లు ,దళారులు తమ పేర్లపై దండుకొని నిజమైన అర్హులకు మొండి చేయి చూపారు.
????మరో విడతలో ఎక్కువ మందికి దళిత బంధు ఇప్పిస్తామని సామాన్య దళిత బిడ్డల దగ్గర రెండు నుండి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశారు. అప్పులు తెచ్చి ఇచ్చిన సామాన్య దళిత బిడ్డలు వాటి వడ్డీలు కట్టలేక ఇటు జీవనం గడవక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.
????మోసపోయిన నా దళిత జాతి బిడ్డలను తగిన న్యాయం చేయాలంటే లక్షల రూపాయలు వసూలు చేసిన డబ్బులను తిరిగి టిఆర్ఎస్ దళారుల నుండి ఇప్పించాలని అట్టి నాయకులపై సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
????ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాణమ్మ, జిల్లా అధికార ప్రతినిధి మైనర్ బాబు ,యూత్ కాంగ్రెస్ నాయకులు దేవేంద్ర బుక్కు దేవరాజు మళ్లీకార్టూన్ మునిస్వామి,మల్దకల్, చిన్నబాబు, దేవదాసు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.