కార్మికవర్గ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఏఐటీయూసీ నిర్విరామ పోరాటాలు..
-ఏఐటీయూసీ 105 వ వ్యవస్థాపక వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 01 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
భారతదేశ కార్మికవర్గ పోరాటాల్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ది ఒక మహోజ్వల పోరాటం చరిత్ర "వితౌట్ ఎఐటియుసి హిస్టరీ దేర్ ఈజ్ నో ఇండియన్ వర్కింగ్ క్లాస్ మూమెంట్" అని ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి మహాసభల్లో సౌహార్దం సందేశాలు ఇస్తూ వాడిన మాటలు అక్షర సత్యాలు, ఎదకోసి, ఎగదోసి అన్న చందాన ఎన్నో పోరాటాలు, ఎన్నో మైలురాళ్ళు 105 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అడుగడుగునా దర్శనమిస్తాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ తెలియచేశారు.
ఏఐటీయూసీ 105 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం విజయనగరం ఎఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయనగరం పి.డబ్ల్యూ.మార్కెట్ లో, డి.ఎన్.ఆర్ అమర్ భవన్ మీద ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఏఐటీయూసీ జెండాలను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జనల నుండి కార్మికుల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వ కుట్రల నుండి ఎన్నో వీరోచిత కార్యాచరణ నేపథ్యంలో ఏఐటీయూసీ ఆవిర్భవించింది. ప్రధమ అధ్యక్షులుగా లాలాలజపతిరాయ్ ని, ప్రధాన కార్యదర్శి గా వి.యం. పవార్ ని మహాసభ ఎన్నుకున్నాది. ఆ తరువాత కాలంలో పండిట్ జవర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, సరోజినినాయుడు, సి.ఆర్.దాస్ ఇంకా చాలామంది స్వాతంత్ర్యోద్యమ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఏఐటీయూసీ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. 1921లో ఝారియాలో జరిగిన ఏఐటీయూసీ ద్వితీయ మహాసభల్లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అందరికన్నా ముందే నినదించి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని తెలిపారు. భారతదేశ స్వతంత్ర పోరాట వేదికగా గుర్తింపు పొందిన భారత జాతీయ కాంగ్రెస్ ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని వ్యతిరేకించింది. ఆ తరువాత స్వతంత్ర పోరాటంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలబడిపోతుందని ఎనిమిదేళ్ళ తరువాత 1929 సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రజలందరికీ, స్వేచ్చా, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశంలో ఎన్నో పోరాటాలు నడిపిన చరిత్ర ఏఐటీయూసీ కి మాత్రమే ఉందన్నారు. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం కార్మికవర్గం పై దాడులు, అర్ధాకలి, అణిచివేత నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ మరోవైపు వారిని సంఘటితం చేస్తూ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో వారి తొత్తులైన స్వదేశీ పెట్టుబడిదారులతో కార్మిక హక్కుల కొరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఎన్నో అలుపెరగని నిర్విరామ పోరాటాలు చేసి కార్మిక వర్గం నేడు అనుభవిస్తున్న సౌకర్యాలను, అమల్లో ఉన్న చట్టాలను ఎన్నిటినో సాధించిన ఘనత ప్రప్రథమంగా ఏఐటీయూసీ కి మాత్రమే దక్కుతుందని తెలిపారు. ◆ 1923 కార్మిక నష్టపరిహార చట్టం. ◆1926 ఇండియన్ ట్రెడ్ యూనియన్ చట్టం. ◆1936 వేతనాల చెల్లింపు చట్టం. ◆ 1947 పారిశ్రామిక వివాదాల చట్టం. ◆1948 పారిశ్రామిక ఉద్యోగ స్థాయి నియామక చట్టం. ◆1966 షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం. 1920 లో పురుడోసుకున్న నాటి నుంచి భారత కార్మిక వర్గానికి ఒకే ఒక్క కేంద్ర కార్మిక సంఘంగా భాసిల్లి దాదాపు 44 రకాల చట్టాలకు రూపశిల్పిగా నిలిచిన చరిత్ర ఏఐటియుసి కి మాత్రమే ఉందని అని కొనియాడారు. ప్రభుత్వరంగ స్థాపన, పరిరక్షణ కొరకు అహర్నిశలు కృషి సల్పిన, సలుపుతున్న జాతీయ అతి పెద్ద కార్మిక సంఘం ఏఐటియుసి అని తెలిపారు. నాటి బ్రిటిష్ మొదలు మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వాల కుత్సితాలకు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉరికొయ్యలు, చెరసాలలు లెక్కచేయక పోరాడి ప్రభుత్వాల భరతం పట్టిన ఘనత దేశంలో ఎఐటియుసి కి మాత్రమే దక్కుతుందన్నారు.నేడు కేంద్రంలో బీజెపీ, రాష్ట్రములో కూటమి ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పై మునుపెన్నడూ లేని రీతిలో దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇప్పటివరకు కలగా ఉన్న కార్మిక చట్టాలు మార్పు పైన మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించిందన్నారు. వర్కర్స్ నియామకం తొలగింపుల్లో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు దారాదత్తం చేసే నిర్ణయాలు చేసే కుట్రలో ఉందన్నారు. భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను రూపుమాపి బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికులని కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గాలకి పాల్పడుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పొందూరు అప్పలరాజు, అప్పరుబోతు జగన్నాధం, వడ్డాది కొండలరావు, కెల్ల.సూర్యనారాయణ, పతివాడ.శ్రీను, మజ్జి.చిన్న, నడిపేన.పాపునాయుడు, మురళి, ఎల్.అప్పన్న, గోపాలు, హరీష్, వాసు మరియు కార్మికులు పాల్గున్నారు.