కొంతాన్ పల్లిలో వెంకట్రాంరెడ్డి ఆర్థికసాయం

కొంతాన్ పల్లిలో వెంకట్రాంరెడ్డి ఆర్థికసాయం

ఉప్పరి సుశీల కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత..

 జనం న్యూస్ డిసెంబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మండల పరిధిలోని కొంతాన్ పల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన ఉప్పరి సుశీల కుటుంబానికి శివ్వంపేట పీఎసీఎస్ చైర్మన్, కొంతాన్ పల్లికి చెందిన చింతల వెంకట్రాంరెడ్డి తన స్వంత డబ్బులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించడం జరిగినది. ఈసందర్బంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఉప్పరి సుశీల మరణించడం బాధాకరమని, ఆమె కుటుంబానికి మరింత సహకారం తప్పకుండ అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో యాదగిరి, శేఖర్, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.