సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు బాధిత కుటుంబాలకు అండ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి

సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు బాధిత కుటుంబాలకు అండ నర్సాపూర్  ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి

పిల్లుట్లలో ముండ్రాతి లచ్చయ్యకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..

 జనం న్యూస్ డిసెంబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్


ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు బాధిత కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన ముండ్రాతి లచ్చయ్యకు ప్రభుత్వం నుండి మంజూరి అయిన 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం మాజీ ఉపసర్పంచ్ లు నాయిని దామోదర్ రెడ్డి, చింత స్వామి, బుర్ర మహేష్ గౌడ్, గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు బబ్బురి వెంకటేష్ యాదవ్, గ్రామకమిటి ఉపాధ్యక్షులు పిల్లి శివకుమార్ చేతుల మీదుగా బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా చింత స్వామి మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆర్థికంగా కొంత వెసులుబాటునిస్తాయని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సునీత రెడ్డికి పిల్లుట్ల గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి పెద్ద వెంకటయ్య, హంసాన్ పల్లి రాంరెడ్డి, బుర్ర పెద్ద పోచగౌడ్, పిల్లి కృష్ణ,డాక్టర్ సండ్ర సుదర్శన్,జనుముల గణేష్, మొనెగారి సత్తయ్య దాసరి పోచయ్య, డప్పు వెంకటేష్, దాసరి వీరేష్,గాండ్ల లక్ష్మయ్య,  గుల్లయ్య గారి రాములు, సండ్ర సత్యనారాయణ, గాండ్ల రాములు, చింతల సంజీవులు, చింత భాగయ్య,దాసరి లింగం, పిల్లి శ్రీనివాస్ జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.