గూడూరు కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో మహిళల చైతన్యంతో మూఢనమ్మకాల నిర్మూల
సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు నరేష్..
కస్తూర్భా బాలికల విద్యాలయంలో మూఢ నమ్మకాలపై అవగాహనా కార్యక్రమం..
జనం న్యూస్ నవంబర్ 11.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
మహిళలనుచైతన్యంతోనే మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ సిఐ రంగ కృష్ణ ఆధ్వర్యంలో శివ్వంపేట పోలీస్ సిబ్బంది సహకారంతో మండల కేంద్రంలోని గూడూరు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం మహిళల రక్షణ- వ్యక్తిత్వ వికాసం- సైన్సు- మూఢనమ్మకాల నిర్మూలన అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహనా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పులేటి నరేష్ హాజరయ్యారు. ఈసందర్బంగా నరేష్ మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని. దొంగ స్వాములు, దొంగ బాబాలు, భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. బాల్యవివాహాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. అనంతరం ఉప్పులేటి నరేష్ మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ స్వామి, భానుచందర్, ఉపాధ్యాయులను స్వరూప,పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.