గూడూరు గురు పీఠం ఆలయ నిర్మాణానికి కోసం విరాళాలు ఇవ్వండి

గూడూరు గురు పీఠం ఆలయ నిర్మాణానికి కోసం విరాళాలు  ఇవ్వండి

త్వరలోనే పూర్తికానున్న గూడూరు గురు పీఠంలో  దత్తాత్రేయ  పంచాయతనం,సాయిబాబా 


 ప్రతి ఇటుక పై ఓం సాయిరాం...

దేవాలయం పనులు......
మొదలైన సాయిబాబా దేవాలయ ప్రకార పనులు..
ఆలయ నిర్మాణంలో ఇటుకల రూపంలో విరాళాలు ఇవ్వండి జిన్నార జి.శివకుమార్ గౌడ్. రమాదేవి దంపతులు ..

 గూడూరుశ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్....

 జనం న్యూస్ నవంబర్ 11.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

దేశంలోనే ఎక్కడ లేని విదంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో  శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదత్త పంచాయతనం, శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయాల నిర్మాణ పనులు అతి త్వరలోనే పూర్తి కానున్నాయని శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ - రమాదేవి దంపతులు అన్నారు. శివ కుమార్ గౌడ్. రమాదేవి విలేకరులతో  మాట్లాడుతూ శ్రీగురుపీఠం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన శ్రీషిరిడి సాయిబాబా దేవాలయ ప్రకార నిర్మాణాన్ని ఆలయ శిల్పలు చేపట్టారని, పనులు కూడ మరింత వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.  శ్రీగురుపీఠం చుట్టూ నిర్మించతలపెట్టిన గోడ, శ్రీషిరిడి సాయిబాబా దేవాలయ సభ మండపం నిర్మాణ పనులు కూడ వీలైనంత తొందరగా చేపట్టడం జరుగుతుందని, అందుకు ఉపయోగించబడే ప్రతి ఇటుకపై ఓం సాయిరాం అనే నామాన్ని లిఖించబడి ఉంటుందని, సాయిబాబా దేవాలయ నిర్మాణానికి విరాళాలను అందించాగోరే భక్తులేవరైనా సరే వారి శక్తిననుసరించి విరాళాన్ని అందించొచ్చునని, ఒక్కో ఇటుక ఖరీదు వంద రూపాయలుగా నిర్ణయించినట్లు జిన్నారం శివకుమార్ గౌడ్. రమాదేవి దంపతులు తెలిపారు. ఎన్ని ఇటుకలు విరాళంగా అందిస్తున్నారో భక్తుల చేతులమీదుగానే అందించి సాయిబాబా కృపకు పాత్రులు కావాలని శివకుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. శ్రీగురుపీఠంనకు విరాళలను అందించే భక్తుల కోసం శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠం వద్ద, శివ్వంపేట ఇండియన్ బ్యాంక్ వద్ద, ప్రతి గ్రామంలోని కూడల్ల వద్ద క్యూఆర్ కోడ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేసే బోర్డులను అతి త్వరలో ఏర్పాటు చేస్తామని, భక్తులందరు కూడ ఈసదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం శివకుమార్ గౌడ్   సూచించారు.