చలివాగు ప్రాజెక్టు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే..

చలివాగు ప్రాజెక్టు చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే..

జనం న్యూస్ నవంబర్ 1 శాయంపేట మండలంలోని  జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువులో హన్మకొండ జిల్లా మత్స్య శాఖ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి నాగమణి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తో కాంగ్రెస్ నాయకులు కలిసి  72వేల ఉచిత చేప చేపలను వదిలారు. అనంతరం అక్కడ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల ఆర్థికాభివృద్ధికి నూరు శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఉచిత చేప పిల్లలు పంపిణీ ద్వారా మత్యకారులకు ఆదాయ వనరులను మెరుగుపరుచుకోవడంతో పాటు జలాశయాలల్లో చేపల ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ (బుజ్జన్న)  గ్రామ అధ్యక్షులు చింతల రవిపాల్ ఉపాధ్యక్షులు మాలపల్లి కటయ్య మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి వరదరాజు చిందం రవి మారే పెల్లి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.....