ఉత్సవాలు, తొలేళ్ళు, సిరిమానోత్సవ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

ఉత్సవాలు, తొలేళ్ళు, సిరిమానోత్సవ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 13 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో ఈ నెల 13న నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, 14, 15 తేదీల్లో నిర్వహించే శ్రీ పైడితల్లమ్మ తొలేళ్ళు, సిరిమానోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల వేదికలను, పైడితల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, సిరిమాను తిరిగే ప్రధాన మార్గంలోని జంక్షన్లు ప్రెజర్ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేయనున్న బ్యారికేడ్లు, పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే వాహనాల మళ్ళింపులు, వాహనాల పార్కింగుకు ఏర్పాటు చేసిన పార్కింగు ప్రదేశాలను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు యితర పోలీసు అధికారులతో కలసి అక్టోబరు 12న స్వయంగా సందర్శించి, క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు చేసారు.

అయోధ్య మైదానంలో నిర్వహించే సంగీత విభావరి, జబర్ధస్త్ నటులు చేసే కామెడీ స్కిట్స్ కు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ముఖ్య అతిధులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదిక వద్ద భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ స్వయంగా పర్యవేక్షించారు. వేదిక వద్ద ఎం.ఐ.పి.లు, వివిఐపిలు, విఐపిలు, ప్రజలకు వేరువేరుగా బ్లాకులు ఏర్పాటు చేయాలని, వేదిక వద్దకు పాస్లు ఉన్నవారిని మాత్రమే ఆయా గ్యాలరీల్లోకి అనుమతించే విధంగాను, సీటింగు ఏర్పాటు, వాహనాల పార్కింగుకు ఏర్పాటు చేయాలని అధికారులను, నిర్వాహకులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. 

అనంతరం, సిరిమాను తిరిగే ప్రధాన మార్గంలోని కోట జంక్షను, గురాచారివీది జంక్షను, గుమ్చి జంక్షను, గురజాడ అప్పారావు రోడ్డు జంక్షను, ఆలయం వద్ద, శివాలయం వీధి జంక్షను, కోరాడ వీధి జంక్షను, కోట్లమాదప్పవీది జంక్షను ప్రాంతాలను జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి, ఆయా జంక్షన్లు వద్ద ఏర్పాటు చేసే ఐరన్ బ్యారికేడ్లు వేసే విధంగాను, ఎటువంటి త్రొక్కిసలాటలు జరగకుండా ఐరన్ బ్యారికేడింగుతో బాక్సులు, రోప్ పార్టీలను ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. 

విజయనగరం పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా వాహనాల మళ్ళింపులు చేపట్టే ఖమ్మవీధి జంక్షను, కొత్తపేట జంక్షను, దాసన్నపేట రైతు బజారు జంక్షను, రాజీవ్ నగర్ కాలనీ జంక్షను, ఫోర్టు సిటీ జంక్షను, ఐన్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూలు జంక్షన్, బాలాజీ జంక్షను, ఆర్టీసి కాంప్లెక్సు, సి.ఎం.ఆర్.జంక్షన్, ఎం.ఆర్.కాలేజ్ జంక్షను, ఎల్లమ్మ గుడి జంక్షను, ద్వారా డ్వాక్రా బజారు ఏర్పాటు చేసిన సరస వద్ద ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగు, మళ్లింపులు చేపట్టే ప్రాంతాలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, ట్రాఫిక్ నియంత్రణ, రెగ్యులేషనుకు అధికారులకు వలు సూచనలు చేసారు.వివిధ ప్రాంతాల నుండి విజయనగరం పట్టణంలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలను పార్కింగు చేసేందుకుగాను 18 చోట్ల అనగా (1) రాజీవ్ స్టేడియం (2) రాజమన్నార్ టెంపుల్ (3) డిఎస్ డిఓ ఇన్ డోర్ స్టేడియం (4) అయ్య కోనేరు గట్టు (మున్సిపల్ పార్కు) (5) ఫోర్టు సిటీ స్కూలు రోడ్ (6) ఎస్.వి.ఎన్. నగర్ (7) కాశిరాజు ఎగ్జిబిషను గ్రౌండు (8) అయోధ్య మైదానం (9) ఎం.ఆర్ కాలేజ్ హాస్టల్ (10) పెద్ద చెరువు (11) గురజాడ కళాక్షేత్రం (12) టి.టి.డి. కళ్యాణ మండపం (13) సి.ఎం.ఆర్. జంక్షన్ వద్ద గల పెద్ద చెరువు గట్టు (14) రైల్వే స్టేషను(15) టింబర్ డిపో దగ్గర గల పెద్ద చెరువు గట్టు (16) రామానాయుడు రోడ్డు (17) ఎం.ఆర్. కాలేజ్ వద్ద గల ఎలక్ట్రికల్ సబ్ స్టేషను (18) ఎం. ఆర్. కాలేజ్ ఏర్పాటు చేసామన్నారు.అదే విధంగా సిరిమాను తిరిగే సమయంకు ముందు ఎం.ఆర్. కాలేజ్ జంక్షన్లు, స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్, కన్యకా పరమేశ్వరి టెంపుల్, ట్యాక్సీ స్టాండు, గోషాసుపత్రి జంక్షన్, గుంచి, సింహాచలం మెడ, సత్య లాడ్జి ప్రాంతాల వద్ద కట్ ఆఫ్ పాయింట్స్ ఏర్పాటు చేసి, వాహనాలను నియంత్రించనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లమ్మ పండగను సజావుగా నిర్వహించేందుకు పోలీసుశాఖ చేపట్టిన భద్రత చర్యలకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.జిల్లా ఎస్పీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన సమయంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, అనకాపల్లి అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్.మోహనరావు, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే. చౌదరి, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, సిహెచ్.సూరి నాయుడు, పలువురు ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.