తల తెగిపోయినా కూడా మనిషిపై దాడి చేసిన పాము.. చనిపోయిన ఐదు గంటల తరువాత..!
జనం న్యూస్: సాంతరణం గా పాములు పగబడతాయి అని అంటూ ఉంటారు ఎంతోమంది. కానీ ఇదంతా ట్రాష్ అని చెబుతూ ఉంటారు నిపుణులు. కానీ ఇక అటు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా పాములు పగబడతాయి అన్న నమ్మకం మాత్రం జనాల్లో గట్టిగా పాతుకు పోయింది అని చెప్పాలి. అయితే పాము తల తెగిపోయిన తర్వాత కూడా ఏకంగా మనిషి పై దాడి చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇక ఇందుకు నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో రకాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా తెగిపడిన పాము తల ఎవరినైనా కాటు వేసింది అంటే ఇక సాధారణంగా ఉన్న పాము కాటు వేసినట్లుగానే విషం మనిషి శరీరంలోకి వెళ్తుంది అని అటు శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక పాము తల తెగిపోయినప్పటికీ దాని శరీరం మాత్రం దాదాపు కొన్ని గంటలపాటు ఇంకా చలనం కలిగి సాదరణ పాము లాగానేకదులుతూ ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా కొన్ని వీడియోలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా పాము చనిపోయి ఐదు గంటలు అయింది. దాని శరీరం నుంచి తల పూర్తిగా వేరైపోయింది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి పాము తోకను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే తల ఉన్న పాము ఎలా అయితే స్పందిస్తూ కాటు వేయడానికి వేగంగా కదులుతుందో.. ఇక తల తెగిపడిన పాము కూడా అదే రీతిలో ఒక్కసారిగా వెనక్కి జరిగింది. దీంతో ఇక పాము తోకను పట్టుకున్న వ్యక్తి జడుసుకొని పక్కకి జరిగాడు. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.