పానీ పూరిలను ఈ ఏనుగు ఎలా తింటోందో చూస్తే ఆశ్చర్యపోతారు..!

జనం న్యూస్: పానీ పూరీని ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ పానీపూరీని ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరికీ పానీపూరీ ఫేవరెట్. చక్కగా పానీ పూరీలో ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. అంతెందుకు పానీపురీ బండి పక్క నుంచి వెళ్తే నోరు ఊరిపోతూ ఉంటుంది. కచ్చితంగా అక్కడ ఆగి తినాల్సిందే. అయితే ఇప్పుడు ఓ వీడియో చూస్తే.. తెలుస్తుంది మనుషులే కాదు జంతువులు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయని. 

మామూలుగా ఎక్కడైనా మనుషులు పానీపురీ తింటూ ఉంటారు కానీ జంతువులు పానీపూరీ తినడం ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు ఒక రోడ్డు పక్కన పానీపూరీ బండి దగ్గర నిలబడి పానీపూరీ తినడం మనం వీడియోలో చూడొచ్చు. చాలా విచిత్రంగా ఉంది కదా? నిజంగా అక్కడికి వచ్చి జనం కూడా ఆశ్చర్య పోతున్నారు. ఈ సన్నివేశాన్ని చూసి చాలా మంది ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. మనకి ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోని చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. పైగా పానీపూరీని తింటూ ఏనుగు చక్కగా ఆనందిస్తోంది. పానీపూరీ అమ్మే వ్యక్తి ఏనుగుపై ఏ మాత్రం చిరాకు పడకుండా దానికి పానీపూరీని ఇస్తున్నాడు. ఎంతో ప్రేమగా ఏనుగుకి పానీపూరీని ఇస్తున్నాడు.