దిక్కున కాడ చెప్పుకోండి
- ఫండ్స్ లేవని చేతులెత్తేసిన ఎంపీడీవో
జనం న్యూస్ 4 నవంబర్ ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలో కోతులు, కుక్కల సమస్య గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కోతుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బడికి వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో కోతుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. ఇండ్లలోకి చొరబడి సామాన్లు ఎత్తుకుపోవడం, మనుషులపై దాడి చేసి గాయపరచడం వంటివి తరచుగా జరుగుతున్నాయి. దీనితో పాటు కుక్కలు కూడా ఏదో వ్యాధి సోకి వీధుల వెంబట తిరుగుతున్నాయి, ఇండ్లలోకి చొరబడుతున్నాయి. గతంలో కోతులు, కుక్కల సమస్య గురించి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చిన కూడా వారు ఎలాంటి చర్య తీసుకోలేదు . చివరిగా గత వారంలో కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే వారం లోపు పరిష్కరిస్తామని ఎంపీడీవో చెప్పారు. పరిష్కారం చేస్తామని చెప్పినందున ఈరోజు భీమారం గ్రామంలోని గ్రామస్తులు మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పరిష్కారం చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు అని అడుగుతే మా దగ్గర ఫండ్స్ లేవు, గత రెండు సంవత్సరాలుగా కేవలం చెత్త తీసుకెళ్లడానికి వెళ్లే ట్రాక్టర్ కి, మరియు నాళాలు తీయడానికి మాత్రమే డబ్బు ఉన్నది. కావాలంటే కోతులు మరి కుక్కలు పట్టే వారి నెంబర్ ఇస్తాను వారితో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. దీంతో అక్కడి ప్రజలు ఆ నెంబర్కు ఫోన్ చేయగా అతను ఒక కోతికి 800,ఒక కుక్కకి 600 అని చెప్పాడు. భీమారం మొత్తంలోవెయ్యికి పైగా కోతులు,200 పైగా కుక్కలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక సతమవుతున్నారు. గ్రామ యువకులు కలిసి భీమారంలో రాస్తారోకో, ర్యాలీ లు చేస్తామని ఇక్కడ సమస్యలను అధికారులు ఖాతరు చేయడం లేదని కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తామని ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మరోసారి ఫిర్యాదు చేస్తూ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.రాజ్ కుమార్, జి సాయి కిరణ్, బి నరేష్, వి అరుణ్ కుమార్,కే రవీందర్,ఎస్ కే హమముద్దీన్, పి శ్రీహరి, జి రవీందర్, ఎన్ రఘు,ఏ మహేష్,వి సాయికృష్ణ, ఎన్ శివకుమార్, గ్రామస్తులు మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు