న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

జనం న్యూస్ అక్టోబర్ 1, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ చైర్మన్ ఆకారపు రాజు గుప్త ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థి నీలచే దుర్గామాతలుగా వేశాదరణ ధరించి అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క శక్తి పీఠాలుగా కూర్చొని వారే కర్తవ్యాన్ని నిరూపించారు. స్కూల్ చైర్మన్ ఆకారపు రాజు గుప్త మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు అన్ని పండుగలను తెలియజేస్తూ బతుకమ్మ దసరా నవరాత్రుల గురించి తెలియజేసిన స్కూల్ టీచర్లను విద్యార్థిలను అభినందించారు. స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థినిలచే బతుకమ్మ సంబరాలు రంగురంగు పూలతో బతుకమ్మలను తయారుచేసి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అబ్దుల్ రాహుల్, స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఆకారపు గౌతమి, మరియు స్కూల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.