పాపం చిన్నారి.. ఊహించని ప్రమాదం వల్ల చిన్నారి పాప బలి.. ఎం జరిగిందంటే..?(వీడియో చూడండి)

జనం న్యూస్: అభం శుభం తెలియని చిన్నారి అకారణంగా మరణించిన ఘటన ఇది. మూడున్నరేళ్ల గిరిజా షిండే మరొక బాలికతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఓ బాలుడు తన ఇంటి గేటును వేస్తుండగా ఆమె వెళ్లి నిల్చుంది. గేటు ఒక్కసారిగా ఊడి చిన్నారిపై పడటంతో అక్కడికక్కడే ఆ చిన్నారి మరణించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాదం మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.