డ్యూటీలో ఉండగా మందు తాగి జాతరలో చిందులు వేసిన ఎస్సై... ఆ తరువాత..? (వీడియో చూడండి).

జనం న్యూస్: చేస్తే చిన్నదైనా సరే ప్రభుత్వం ఉద్యోగం చేయాలిరా అని భావిస్తుంటారు చాలా మంది. దాని వెనుక చాలా కారణాలున్నాయి. జీతం సమయానికి పడిపోవడంతో పాటు ఒత్తిడి తక్కువ, టైంకి వెళ్లి.. టైంకి రావచ్చు, సెక్యూర్డ్ జాబ్ అన్న భావన వస్తుంటుంది. అయితే వీరి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది సెల్ ఫోన్. సోషల్ మీడియా వచ్చాక విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్‌లో రీల్స్ చేసినందుకు ఓ పోలీస్ అధికారిణి సస్పెండ్ అయిన సంగతి విదితమే. మహారాష్ట్రలో విధుల్లో ఉండగానే ఇన్ స్టా రీల్స్ చేసిందని ఓ బస్ కండక్టర్ ఉద్యోగం ఊడిపోయింది. తాజాగా ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బలయ్యాడు. కేరళలో ఓ ఆలయం జాతర జరుగుతుండగా.. అక్కడ విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు ఇన్‌స్పెక్టర్. అంతలో ఓ పాట ప్లే కాగా, వెనకా ముందు ఆలోచించకుండా డాన్స్ చేశాడు. దీన్ని సెల్ ఫోన్‌లో వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో అతడి ఉద్యోగం పోయింది. వివరాల్లోకి వెళితే ఇడుక్కి జిల్లాలోని శాంతన్ పారలో పూపార మరియమ్మన్ దేవత జాతర జరుగుతుంది. జాతర బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం సంతన్‌పర పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై కెపీ షాజీ తన బృందంతో కలిసి వెళ్లారు. అదే సమయంలో భక్తులు దేవత ముందు పలు పాటలు పెట్టారు. అయితే ఓ తమిళ పాట ప్లే అవుతున్న సమయంలో ఎస్సై ఆదమరిచి డ్యాన్స్ చేశాడు.విధి నిర్వహణలో ఉన్నానని, తాను ఓ పోలీసు అనే విషయాన్ని మరచిపోయి చిందులేశారు. ఆయన యూనిఫాంలో తన్మయత్వంతో డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్నవారంతా అతను మందు తాగు చిందులు వేస్తున్నాడు అని భావించి తమ ఫోన్లకు పని చెప్పారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. విచారణలో విధి నిర్వహణలో ఉంటూ మద్యం సేవించినట్లు తేలడంతో అదనపు సబ్-ఇన్‌స్పెక్టర్ షాజీని సస్పెండ్ చేశారు. మున్నార్‌ డీవైఎస్పీ, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు జరిపిన విచారణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక కూడా అందజేశారు.