పెళ్లి కావడంలేదని.. ఉరేసుకున్నాడు

పెళ్లి కావడంలేదని.. ఉరేసుకున్నాడు

విజయనగరం మే 13, 2023 గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి చెందిన జయంతి శ్రీనివాస రామశాస్త్రి (28) శుక్రవారం మధ్యాహ్నం ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గంట్యాడ ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు అందించిన వివరాలు ప్రకారం మృతుడు గ్రామంలోని ఆలయ పూజారిగా చేస్తున్నాడు. పలుసార్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, ఉరివేసుకుని చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.