పోలింగ్ స్టేషన్ ల తుది జాబితా ప్రదర్శన
మండలంలో 312 పోలింగ్ స్టేషన్ ల లిస్టు తయారు ఎంపీడీవో నాగేశ్వరరావు....
జనం న్యూస్ డిసెంబర్17.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మండల వ్యాప్తంగా 312 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీఓ నాగేశ్వర్ తెలిపారు. 37 గ్రామపంచాయతీలలో ఒక్కో వార్డుకు సంబంధించి మండలములో మొత్తం 312 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు సంబందించిన తుది జాబితాను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం రూపొందించిన ఫైనల్ లిస్టు ప్రకారమే మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.