అరేయ్ ఏంట్రా ఇది... కోడలితో 70 ఏళ్ల మామ పెళ్లి..? అసలేంకరిగింది.
జనం న్యూస్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలు, విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ నలుమూలల్లో జరిగిన ఆసక్తికర ఘటనలు అన్నీ కూడా అటు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు ఎంతో మందిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి అందరిని నోరేళ్లపెట్టేలా చేసింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి తెలిసిన తర్వాత షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇంతకీ అంతలా అందరిని ఆశ్చర్యపరుస్తున్న వార్త ఏమిటో తెలుసా ఒక మహిళా పెళ్లి చేసుకోవడమే. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని, ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లా చపియా ఉమ్రావు గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన కైలాష్, యాదవ్ దంపతులకు నలుగురు సంతానం. అందరు వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం కైలాష్ భార్య మృతి చెందింది. కైలాష్ యాదవ్ బర్హల్ గంజ్ పోలీస్ స్టేషన్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు కొన్నేళ్ల క్రితం శైలాష్ మూడో కుమారుడు మృతి చెందడంతో అతడి భార్య పూజ (30) ఒంటరిగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కైలాష్ (70) స్థానిక గుడిలో ఆమె నుదుట సింధూరం దిద్ది పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యా.రు ఈ వివాహానికి పూజ తరపు బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వార్త వైరల్ అవ్వడంతో విషయం పోలీసులకు తెలిసింది. అయితే ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని బర్హల్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి తెలిపారు. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో కుదిరిన వివాహం అని, కాబట్టి తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.