ఫించన్ లు పంపిణీ చేసిన ఎంపీడీవో..
మార్కాపురం: మండలం లోని రాయవరం గ్రామంలో శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి భోగాని శ్రీనివాసరావు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. వీరితో పాటుగా రాయవరం పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ డిసెంబర్ 1 వ తేదీ ఆదివారం కావడంతో, ఫించన్ దారులకు ఇబ్బంది లేకుండా ముందు రోజే శనివారం ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.