భూగర్భంలో ఒళ్ళు జలదరించే మ్యూజియం.. ఎక్కడ ఉందో ఎలా ఉందో మీకు తెలుసా..? ( వీడియో చూడండి).

జనం న్యూస్: ప్యారిస్ అందాలకు ఎవరైనా ముగ్ధులైపోతారు. ప్యారిస్ అంటే అందాలే అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ మెరుపుల నగరం అడుగు భాగంలో వణుకు పుట్టించే ఒక వింత ఉంది. ఈ నగర వీధుల కిందే ఉన్న ఈ వింతను చూస్తే ఎవరికైనా సరే శరీరం భయంతో ఝల్లుమంటుంది. ఎందుకంటే ఈ అందాల నగరం కింద కుప్పలు తెప్పలుగా ఉన్నది మానవ కంకాళాలు! అస్థిపంజరాలూ, ఎముకలు, పుర్రెలు. ఒకటి కాదు రెండు కాదు కనీసం 60 లేక 70 లక్షలమందికి చెందిన మానవ అవశేషాలు ప్యారిస్ నగరం కిందే ఉన్నాయి. వీటినే ప్యారిస్ కాటకోంబ్స్ అంటారు. నెపోలియన్ హయాంలోనే చాలా మంది పనివాళ్లు సొరంగాల్లోకి వెళ్లి కుప్పలు తెప్పలుగా ఉన్న ఎముకలను రకరకాల ఆకృతుల్లో అమర్చారు. ఇప్పుడు ఈ కాటకోంబ్స్ సందర్శకులకు ఇవి ప్రత్యేక ఆకర్షణలు. అయితే ఈ సొరంగాల్లో కేవలం కాస్త అటూఇటుగా 1 మైలు మాత్రమే సందర్శించడానికి వీలుంటుంది. దీని ప్రవేశ మార్గం తలుపు మీద ‘‘ఆగండి! ఇది మరణ సామ్రాజ్యం’’ అని రాసి ఉంటుంది. సందర్శకులకు అనుమతి ఉన్న ఈ కంకాళాల మ్యూజియం మొత్తం నడవడానికి ఓ 45 నిమిషాలు పడుతుంది. ఆ టైం మొత్తం టూరిస్టులకు ముచ్చెమటలు పడుతూనే ఉంటాయి. ఎంతైనా ఎటు చూసినా కంకాళాలే కనిపించే ఈ సొరంగంలో ఈ కళాకృతులు కొంత ఊరట. కానీ ఈ కాటకోంబ్స్ సందర్శన మాత్రం భలే థ్రిల్ అని టూరిస్టుల స్పందన.