మహిళ చట్టాలు పై అవగాహన :-సివిల్ కోర్టు జడ్జ్ ఎస్. అరుణ శ్రీ

మహిళ చట్టాలు పై అవగాహన :-సివిల్ కోర్టు జడ్జ్ ఎస్. అరుణ శ్రీ

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం-: మండల పరిషత్ కార్యాలయంలో శనివారం విధన్ సే సమాదాన్ న్యాయ విజ్ఞాన సదస్సు జాతీయ మహిళల చట్టాలు పైన సివిల్ కోర్ట్ జడ్జి ఎస్ అరుణ శ్రీ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అందరూ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని ఆడపిల్లలు స్కూల్ కి కాలేజీలకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు పరిరక్షణ చేయాలని ఆదిలోనే వారిని మంచి మార్గంలో ఉండేటట్టు తగు చర్యలు తీసుకోవాలని ఆడపిల్లలను యువకులు ఎటువంటి ఇబ్బందులు పెట్టిన వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె. విజయలక్ష్మి. ఎస్ఐ సింహాచలం.సి డి పి ఓ టీ. సులేఖ.అడ్వకేట్ ఎన్ ప్రేమ లత. అడ్వకేట్ డి.లక్ష్మి. ఏపి 

ఎం ఉమామహేశ్వరరావు తదితర మహిళలు పాల్గొన్నారు.