గుజ్జుమానుపాకాల గ్రామంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసిపి నాయకులు

గుజ్జుమానుపాకాల గ్రామంలో   జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసిపి  నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 22( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )

 అల్లూరి సీతారామరాజు జిల్లా 

  పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం కొండగోకిరి పంచాయతీ గుజ్జు మానుపాకల గ్రామంలో పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆదేశాలు మేరకు కొయ్యూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

 ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ధైర్యం,సాహసం,మానవత్వం,మాటతప్పకపోవడం 

పుష్కలంగా ఉన్న 

డైనమిక్ లీడర్ వైస్ జగన్ ,మానవత్వం నామతం,మాటతప్పకపోవడం నాకులం అని,చెప్పిన ధైర్య శాలి వైస్ జగన్ అని కొనియాడారు.

మేనిఫెస్టో నాకు భగవద్ గీత ,ఖురాన్, బైబిల్ 

అని చెప్పి 98 శాతం అమలు చేసిన మగధీరుడు వైయస్ జగన్ అని,పిల్లలకు 

మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అని బలంగా నమ్మి మనబడి,నాడు-నేడు 

ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ ఈ , ఐబీ , టోఫెల్ ,ట్యాబ్లు, డిజిటల్ క్లాస్ లు ప్రవేశ పెట్టి  

73 వేల కోట్లతో విద్యా సంస్కరణలు

అమలు చేసిన గొప్ప దార్శనికుడు వైస్ జగన్ అని అన్నారు.

వైద్యానికి పెద్ద పీట వేస్తూ  

8,480 కోట్లతో జగన్‌ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు-17అని,

పేదలను ఆదుకోవడానికి 

2 .74 లక్షల కోట్లు ఇచ్చిన మానవతావాది జగన్ అని అన్నారు.

బాబు హయాములో 

ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు-34 వేలు 

జగన్ పాలనలో వచ్చిన 

ప్రభుత్వ ,కాంట్రాక్టు ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

శాశ్వత ఉద్యోగాలు-2,31,003

కాంట్రాక్టు ఉద్యోగాలు-43,923

ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలు-3,73,161

మొత్తం ఉద్యోగాలు-6,48,087 ఉద్యోగాలు ఇవ్వడం అని అన్నారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం లో 

దేశంలో 2వ స్థానంలో ఏపీ ఉందంటే అది జగన్ సమర్ధతకు చిహ్నం అని,

వరుసగా 2 ఏళ్ళు కరోనా రావడం వలన 70 వేల కోట్ల నష్టం వచ్చినా కూడా 

రాష్ట్రాన్ని తక్కువ అప్పుతో అభివృద్ధిలో పరిగెత్తించాడు 

అని అన్నారు.

గత ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయము ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో, ప్రజలను సంక్షేమ బాటలో, మహిళలను సాధికారత దిశగా నడిపించి, రైతన్నలను నిజమైన అన్నదాతలుగా నిలబెట్టి, గ్రామ స్వరాజ్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన ఘనత శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని, గెలుపోటములతో సంభందం లేకుండా, నిత్యం ప్రజా సక్షేమం కోసం ఆలోచించే జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ,మండల పార్టీ అధ్యక్షులు జల్లిబాబులు, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి సత్యనారాయణ,మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, మాజీ చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,సర్పంచులు పోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు,మండల సచివాలయం కన్వీనర్ బండి సుధాకర్, ఎంపీటీసీ బిడిజాన అప్పారావు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ పొట్టిక పోతురాజు, కోడా రాజబాబు, వేముల రమణ,కాళ్ల వనంబాబు,సడ్డ సావిత్రి, రామ్మూర్తి ,ఏలూరి రామరాజ్యం,సర్పంచులు,ఎంపీటీసీలు, వైయస్సార్సీపి కార్యకర్తలు ,అభిమానులు, ప్రజలు పాల్గొని కేక్ కట్ చేసి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.