ఆశ్రమ పాఠశాల వాంకిడి లో మళ్లీ విద్యార్థులకు అస్వస్థత*

ఆశ్రమ పాఠశాల వాంకిడి లో మళ్లీ విద్యార్థులకు అస్వస్థత*

*విద్యార్థులను పరామర్శించిన బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యేలాగతి సుచిత్*

 *అస్వస్థతతో ఒక విద్యార్థిని మరణించిన కూడా* 

*వాంకిడి ఆశ్రమ పాఠశాల సిబ్బంది ఇంతటి నిర్లక్ష్య ధోరణితో ఉండటం విడ్డూరం* 

 *ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల ప్రాణాలపై లెక్కలేదా* 

 *విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం*

జనం న్యూస్ డిసెంబర్ 11

 భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యార్థినిల పరిస్థితిని వెళ్లి గమనించగ ఆ పాఠశాల యొక్క ఐదుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు అని తెలుసుకొని హుటా హుటిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినిలను పరామర్శించారు . వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మరుగైన వైద్యం అందించాలని కోరారు... అనంతరం వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల యొక్క విద్యార్థినులను ఏమాత్రం పట్టించకుండా కనీసం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని గత నెల ఆస్వస్థతతో మరణించిన కూడా ప్రభుత్వానికి బుద్ధి లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ప్రాణాలతో ప్రభుత్వ అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కావచ్చు ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి మార్చుకోవాలని. ఏ ఒక్క విద్యార్థినికి ఏమైనా జరిగిన భారతీయ జనతా యువమజ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని... తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు భారతీయ జనతా యువమోర్చన వాంకిడి మండల అధ్యక్షులు మండల వికాస్ మండల ఉపాధ్యక్షులు దేవకరి సాయి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు