రుణమాఫీ కాని రైతుల వివరాలను కలెక్టర్ గారికి నివేదిస్తాం
జనం న్యూస్ 23 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా - నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్...*
జోగులాంబ గద్వాల జిల్లా: నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన అనగా శుక్రవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తున్నట్లు ఈ రోజు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒకవైపు ప్రభుత్వము రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని మభ్యపెడుతున్నా, వాస్తవానికి గ్రామాలలో కనీసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు ఇంతవరకు రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని, ఏవైతే చిన్న చిన్న కారణాలు చెబుతున్నారో బ్యాంకర్ లతో సమావేశం ఏర్పాటు చేసి వాటిని పరిష్కారం చేసి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దసరా లోపు ఇస్తామన్న రైతు భరోసా ఊసే లేదని రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా రైతు రుణమాఫీ కాని రైతులు వారి భూమి యొక్క పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ పత్రాలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఈ వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తామని అన్నారు.కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ బుచ్చిబాబు పట్టణ నాయకులు గౌని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కార్యదర్శి లవన్న, జిల్లా నాయకులు వెంకట్రాములు మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు నాయుడు, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవింద్,మండల కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.