వరద బాధితులకు మాజీ సైనికుల సాయం
జనం న్యూస్ 15 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
విజయవాడ వరద బాధితులను ఆదుకొని తమ వంతు సహాయాన్ని అందించేందుకు మాజీ సైనికులు ముందుకు వచ్చారు. జిల్లాలోని నేతాజీ మాజీ సైనికుల సంఘం సభ్యులు వరద బాధితుల సహాయార్థం రూ.1,00,123 విరాళంగా అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సంఘం ప్రతినిధులు కలెక్టర్ అంబేడ్కర్‌కు విజయనగరం కలెక్టరేట్లో అందజేశారు.