*విద్యార్థులు తినే అన్నంలోపురుగులు,పప్పు,సాంబార్ లో "నత్తలు,బొందింకలు"*.

*విద్యార్థులు తినే అన్నంలోపురుగులు,పప్పు,సాంబార్ లో "నత్తలు,బొందింకలు"*.

జనం న్యూస్ 02 అక్టోబర్ 2024. వచ్చిన ఆహారాన్ని తిని నిన్న కాలేజీలో ప్రేయర్ సమయంలో సృహ కొలిపోయి కింద పడిపోయిన విద్యార్థినీ.????????????విద్యార్థుల సమస్యలు పరిష్కరించి హాస్టల్ వార్డెన్ లను సస్పెండ్ చేయాలనీ.

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం యందు "PDSU నడిగడ్డ విద్యార్థి సంఘం" ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణ గారికీ వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా PDSU నడిగడ్డ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుపోగుల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ మాట్లాడుతూ.. జోగులంభ గద్వాల జిల్లా కేంద్రంలోని మహిళల BC,SC కాలేజి హాస్టల్స్ లో విద్యార్థినీయుల పరిస్థితులు వర్ణాతీతం..

1.తరుచుగా విద్యార్థులు వాథింగ్స్,ఫుడ్ పాయిజన్ చేసుకుంటున్నారు.అందువల్ల ప్రతి ఆదివారం నాడు తమ ఊర్లకు వెళుతున్న విద్యార్ధులు.

2.హాస్టల్స్ లో బాత్రూమ్స్ క్లిన్ చేయరు దానివల్ల దుర్వాసనతో హాస్టల్ మొత్తం వ్యాపిస్తుంది.మరియుప్యాడ్స్ వేయడానికి డస్ట్ బిన్ కూడా లేవు మా బాధ ఘోరంగా ఉంది కన్నీటితో విద్యార్థినియులు

3.ప్రహరీ గోడలు పడిపోవడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లోకి పాములు,కుక్కలు వస్తున్నాయి.

4.సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం లేదు.

6.తాగే నీళ్ళ ట్యాంక్ లో అపరిశుభ్రంగా ఉంటుంది,నీళ్ళలో పురుగులు వస్తున్నాయి,తాగడానికి,వాడుకోవడానికి అదే నీళ్ళు ఉపయోగిస్తున్నారు..

7.హాస్టల్ నుండి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ మధ్యాహ్నం వరకు దుర్వాసనతో పసిపోతున్నది.

8.రాత్రి వేళలో మాత్రమే కరీస్ పెడుతున్నారు.

9.వంట పనులు,బియ్యం, కూరగాయలు కడగడం లాంటి సగం పనులు విద్యార్థులే చేసుకుంటున్నారు.

10..సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు హాస్టల్ వార్డెన్ చెప్పితే,కొట్టడం,అసభ్యంగా తిట్టడం.విద్యార్థులకు వర్ణింగ్ ఇవ్వడం. 

11.వార్డెన్స్ సరిగ్గ హాస్టల్ కు రావడం లేదు.

12.వారంలో ఒక్కరోజు మాత్రమే ఎగ్స్ మరియు అరటిపండులు ఇస్తున్నారు.

13.హాస్టల్లో స్టడీవ్వార్స్ సరిగ్గ నిర్వహించట్లేదు.

కావున తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని హాస్టల్స్ సందర్శించి విచారణ జరిపించి,విద్యార్థుల ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని,వార్డెన్స్ సస్పెండ్ చేయాలని కోరారు..

వినతిపత్రం అందజేషిన వారిలో.PDSU నడిగడ్డ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు, మన్యం,దౌలత్,వినోద్,రాకేష్,చక్రి,హరి కృష్ణ,ప్రవీణ్ తదితరులు ఉన్నారు.