హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.
జనం న్యూస్ సెప్టెంబర్ 30 వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో తిరుపతిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ కాటన్ సీడ్ ఆయిల్ కలిపి విష ప్రయోగానికి వ్యతిరేకంగా పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి కొడంగల్ చౌరస్తా బస్టాండ్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు పరిగి హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టినారు. ఈ కార్యక్రమంలో పరిగి ఇందు ఉత్సవ సమితి సభ్యులు మరియు పెద్ద ఎత్తున హిందువులు తదితరులు పాల్గొన్నారు.