అధ్భుతం అంటే ఇదే ఏమో....! ఈ వీడియో చేస్తే కచ్చితంగా షాక్ అవుతారు తప్పకుండా చూడండి.

జనం న్యూస్: ఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం కూడా ఏమీ చేయలేదు అని ఎంతో మంది పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు . అయితే ఈ సామెత ముమ్మాటికి నిజం అని నిరూపించే ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగాయి అని చెప్పాలి. దారుణంగా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎంతోమంది బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సామెతకు ఇటీవలే ఒక సజీవమైన ఉదాహరణ ఇక్కడ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక్కడ జరిగింది చూసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇదేలా సాధ్యమైందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణంగా చిన్న పిల్లలు కాస్త బైక్ మీద నుంచి పడితేనే దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్నారి 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా.. ఆ చిన్నారికి ఏం కాలేదు. ఏమి జరగలేదు అన్నట్లుగానే లేచి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియోలో బాలిక ఎంత ఎత్తు నుంచి కింద పడిందో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే అక్కడ ఒక మోటార్ సైకిల్ ఉంది. పైనుంచి చిన్నారి డైరెక్టుగా నేల మీద పడలేదు. ఇక ముందుగా మోటార్ సైకిల్ సీట్ పై పడింది. బైక్ సీటు మీద నుంచి ఇక నేలపై పడింది చిన్నారి. తద్వారా ఇక ప్రమాద ప్రభావం తగ్గినట్లు తెలుస్తుంది. ఆ చిన్నారికి ఏ మేరకు గాయమైంది అన్న విషయం తెలియనప్పటికీ.. ఘటన జరిగిన తర్వాత చిన్నారి నేల మీద నుంచి ఎంతో వేగంగా లేచి నిలబడి చేతులు దులుపుకుంటూ కనిపిస్తుంది. అంతేకాదు నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.