అమానుషం.. విలేకరిని చెట్టుకు కట్టేసి కొట్టిన కొందరు దుండగులు ఎందుకో తెలుసా..? (వీడియో చూడండి)

జనం న్యూస్: ఓ యువ జర్నలిస్టు పై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. చెట్టుకు కట్టేసి.. విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ యాదవ్ అనే జర్నలిస్టు స్థానిక ఓ టీవీ ఛానల్లో పని చేస్తున్నారు. ఈ నెల 25న విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి అతడిని అడ్డగించి, గతంలో జరిగిన ఓ సంఘటన గురించి వాదనకు దిగాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న నరేంద్ర యాదవ్ అనే మరో వ్యక్తి జర్నలిస్టును దుర్భాషలాడారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈలోగా అక్కడికి చేరిన మరికొందరు ఆయన్ను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.