అరేయ్.. ఇదెక్కడి పెళ్లి రా నాయనా..! 13 ఏళ్ళ పిల్లాడితో మహిళకు పెళ్లి..! (వీడియో చూడండి)

జనం న్యూస్: ఓ వింత పెళ్లి ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలో అమ్మాయి వయస్సు 23కాగా... అబ్బాయి వయసు 13 ఏళ్లేనట. ఇదేం చోద్యమని షాకవ్వండి... నిజమే. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ వివాహం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కౌతాళం మండలం ఉప్పరహాల్‌కచు చెందిన 13 ఏళ్ల బాలుడికి అక్క కూతురైన కర్ణాటకలోని సిరుగుప్ప సమీప గ్రామానికి చెంది 23 ఏళ్ల అమ్మాయితో వివాహం చేశారు. వీరిద్దరూ బంధువులు కావడంతో పెద్దలు పెళ్లి కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి బంధువులు కూడా భారీగా తరలివచ్చారట. కుటంబ సమస్యల వల్లే బాలుడికి త్వరగా వివాహం చేశారట. ఈ పెళ్లి వ్యవహారం వారం తర్వాత... వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. విషయం ఆ నోటా ఈ నోటా అధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆ ఊరికి వెళ్లి ఆరా తీయగా... జంట అక్కడ లేదట. మైనర్ బాలుడికి పెళ్లి చేయడం నేరం కావడంతో వీరిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే కర్ణాటక సరిహద్దులోని గ్రామాల్లో ఇలాంటి వివాహాలు సాధారణమని స్థానికులు చెప్పడం కొసమెరుపు.