ఏంటమ్మా ఇది..! రోడ్డుపై సిగరెట్ తాగుతూ ఫోజులు.. ఇంట్లో నాన చేతిలో బెల్ట్ దెబ్బలు (వీడియో చూడండి)

జనం న్యూస్: ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చి మరింత పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలకు పరిమితం అయిపోయి అందులోనే బతికేస్తున్నారు. అంతే కాకుండా పలువురు పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. రద్దీ ఉన్న రోడ్లపై బైక్ స్టంట్లు, అలాగే చిత్ర, విచిత్రమైన పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి చేసిన వీడియో వైరల్ కాగా.. తండ్రి ఆగ్రహానికి బలైంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి రీల్స్ పిచ్చితో ఫేమస్ అయ్యేందుకు సిగరెట్ కాల్చుకుంటూ రోడ్లపై డ్యాన్స్‌లు చేస్తుంది. అనుకున్నట్లుగానే వీడియో వైరల్ కావంతో పాటు.. వాళ్ల తండ్రి కూడా వీడియోను చూశాడు. ఇంకేముంది బెల్ట్ తీసి గొడ్డును కొట్టినట్లు కొట్టాడు. ఆ యువతి సిగరెట్ కాల్చిన వీడియోకు.. వాళ్ల తండ్రి కొట్టిన వీడియోను కూడా జతచేసి షేర్ చెయ్యడంతో.. ప్రజెంట్ అది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.