అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన జిల్లా కలెక్టర్.. (వీడియో చూడండి)
జనం న్యూస్: ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత రకరకాల వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు. నెటిజన్లను ఈ వీడియోలు ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కు నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేరళలోని ఓ జిల్లా కలెక్టర్ విద్యార్థులు నిర్వహించిన ప్లాష్ మాబ్‌లో చేరి డ్యాన్స్ చేశారు. స్టూడెంట్స్ తో సమానంతో ఎంతో ఉత్సాహంగా స్టెప్స్ వేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అజిన్ పథనంతిట్ట ఫేస్‌బుక్ లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో పాతానంతిట్ట జిల్లా కలెక్టర్ అధికారి దివ్య ఎస్ అయ్యర్ కనిపిస్తున్నారు. కేరళలోని సెంట్రల్ ట్రావెన్‌కోర్ ప్రాంతంలో ఉన్న పతనం తిట్ట ఓ మున్సిపాలిటీ ఆహ్లాదకరమైన ఈ వీడియోలో దివ్య అయ్యర్ రణవీర్ సింగ్ దీపీకా పదుకునే నటించిన గోలియో కీ రాసలీల రామ్‌లీల లోని గాన సాంగ్ ధోల్ పాటకు విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. విద్యార్థులతో కలిసి దివ్య పాటను ఎంజాయ్ చేస్తూ.. చక్కగా డ్యాన్స్ చేశారు. మహత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఈ తరుణంలో జిల్లా స్టేడియంలో కళాశాల విద్యార్థులు ప్లాష్ మాబ్‌ను ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ ను దీప ప్రజ్వలనంతో ప్రారంభించడానికి వేదిక మీదకు ఐఏఎస్ అధికారిని దివ్య రావడంతో.. స్టూడెంట్స్ తమతో పాటు డ్యాన్స్ చేయమని కలెక్టర్ కోరారు. దీంతో స్టూడెంట్స్ తో పాటు దివ్యజాయిన్ అయ్యారు. నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. అయ్యర్ స్పూర్తిని ప్రజలు ప్రశంసించారు. విద్యార్థులతో సరదాగా గడిపినందుకు దివ్యపై పొగడ్తల వర్షం కురిపించారు.