కర్మ అంటే ఇదే ఏమో.. బిచ్చగత్తెను కాలితో తన్నిన పోలీసు గతి ఎం అయ్యిందో మీరే చూడండి.
జనం న్యూస్: హిందూ ధర్మంలో కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ తగిన ఫలితాన్ని తిరిగి ఇచ్చేస్తుందని విశ్వాసం. ఇందుకు సంబంధించిన అనేక సంఘటలు ఉదాహరణలుగా కనుల ముందు సాక్షంగా నిలుస్తున్నాయి. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోడ్డు పక్కన కూర్చున్న వృద్ధురాలి దగ్గరకు ఓ మహిళా ట్రాఫిక్ పోలీసు చేరుకుంది. ఆ వృద్ధురాలిని అక్కడ నుంచి లేవమని.. అంటూ.. ఆ మహిళను తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్దురాలు రోడ్డు పక్కన కూర్చున్న దృశ్యాన్ని చూడవచ్చు. అక్కడికి వచ్చిన మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారి.. ఆ వృద్ధురాలిని తన్ని తరిమి తరిమి కొట్టిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. వృద్ధురాలిని తరిమి కొట్టిన మహిళా పోలీసు అక్కడ నిల్చుని ఉంది.. అప్పుడు సడెన్ గా ఓ వాహనం అటుగా వచ్చి ఆమెని గుద్దింది. ఈ వీడియో @malladi_rag అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్గా మారింది. ప్రస్తుతం, వీడియో కేవలం 6 రోజుల షేర్లో 3.5 మిలియన్లు అంటే 30 లక్షల మందికి పైగా చూశారు. అలాగే 151,496 మంది వీడియోను లైక్ చేసారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ‘ఇది నిజమైన సంఘటన కాదు, స్క్రిప్ట్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే చివర్లో ఓ మంచి సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. మరికొందరు కర్మం ఫలం అంటే ఇదే అంటూ.. చేసిన మంచి, చెడులు ఎప్పుడూ ఎక్కడకి పోవు.. తిరిగి అందుకు తగిన ఫలాలను ఇచ్చేస్తాయి అంటూ కామెంట్ చేశారు.