నిద్రలో ఉన్న మహిళకు ఊహించని షాక్.. పైకి దూసుకొచ్చిన పాము.. ఆ తరువాత..? (వీడియో చూడండి)

జనం న్యూస్: ఇళ్లు, వాహనాలు తదితర ప్రదేశాల్లో ఊహించని విధంగా పాములు దర్శనమిస్తుంటాయి. చివరకు కొన్నిసార్లు ఫ్రిడ్జిలు, వాహనాల సీట్లు, బూట్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడికి చొరబడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి గాఢ నిద్రలో ఉండగా.. ఓ పెద్ద పాము దూసుకొచ్చింది. యువతి మీదకు వెళ్లగానే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి గడ్డి నేలపై చాప పరుచుకుని పడుకుని ఉంటుంది. బాగా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద పాము పాక్కుంటూ ఆమె సమీపానికి వెళ్తుంది. అంతటితో ఆగకుండా పాక్కుంటూ ఏకంగా ఆమె మీదకు వెళ్తుంది. పాము మెడపైకి రాగానే.. యువతి ఉలిక్కిపడి లేస్తుంది. పామును చూసి షాక్ అయిన యువతి.. అక్కడి నుంచి పక్కకు పారిపోతుంది. అయితే ఆ పాము ఆమెకు ఎలాంటి హానీ చేయకపోవడంతో అంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ''వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది బాబోయ్''.. అంటూ కొందరు, ''వ్యూస్ కోసం ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.