నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కు ఘనంగా సన్మానించిన

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కు ఘనంగా సన్మానించిన

ప్రముఖ వ్యాపారవేత  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్..


జనం న్యూస్ సెప్టెంబర్11.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కె.సత్యనారాయణ గౌడ్

మెదక్ జిల్లాశివంపేట మండలం నూతన ప్రెస్ క్లబ్ షేక్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ అజీజ్ లను ఎన్నికైన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రముఖ వ్యాపారవేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా శాలువతో సన్మానించారు  ఈ సందర్భంగా కొడకంచి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి అనేక పత్రిక రంగంలో జర్నలిస్టుగా పనిచేసిన అబ్దుల్ అజిత్ పత్రిక రంగంలో వాస్తవాలను వెలుగులోకి  తెస్తున్న  నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజిత్ అభినందించారు నూతన ప్రెస్ క్లబ్ సభ్యులకు తన వంతు  సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని కొడకంచి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్. నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాసంపల్లి.బి శ్రీనివాస్ గౌడ్.మాజీ దేవస్థానం డైరెక్టర్ హరి శంకర్ గౌడ్ మాజీ సర్పంచ్ హంస బాయ్ హరి సింగ్  సింగాయపల్లి నారాయణరావు.డి కృష్ణ కొడకంచి లింగం గౌడ్.పాండ్యా నాయక్. నర్సింలు పాల్గొన్నారు