పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలి.*
జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట. పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు మలిపెద్ది కృష్ణశాస్త్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని శివ మార్కండేయ, శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయాలలో మంగళవారం జిల్లా ఉపాధ్యక్షులు మార్త రాజకుమార్ అధ్యక్షతన జిల్లా ప్రథమ సమావేశం జరగగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. పద్మ బ్రాహ్మణులు పురోహితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎంతోమంది నిరుపేదలు ఈ వృత్తిలో కొనసాగుతున్నారని, అర్హులైన నిరుపేదలందరికీ పెన్షన్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పద్మ బ్రాహ్మణులకు హెల్త్ కార్డులు జారీ చేసి కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. అనంతరం మార్కండేయ వ్రతాన్ని నిర్వహించారు. జిల్లా పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల ఓంకార్ శాస్త్రి, తెలంగాణ రాష్ట్ర వేద పాఠశాల అధ్యక్షులు క్యాతం రాజకుమార్ శాస్త్రి, ఫిలిం డైరెక్టర్, కర్ణాటక కుక్కి దేవాలయ కమిటీ సభ్యులు తౌటం శ్రీనివాస్, మాజీ ఎంపీడీవో గొల్లపల్లి విద్యాసాగర్, మత్స్యగిరి స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి, పద్మ బ్రాహ్మణులు రంగు యాదగిరి, చిందం కర్ణాకర్, మామిడి శివ సాయి, మామిడి సురేష్, కుసుమ రామకృష్ణ, రాచర్ల రాజు పాల్గొన్నారు....