పలు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక సందర్శించిన సిడిపిఓ సుజాత

పలు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక సందర్శించిన సిడిపిఓ  సుజాత

జనం న్యూస్ సెప్టెంబర్ 06,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం సిడిపిఓ సుజాత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లల హాజరు రిజిస్టర్, బాలింతల రిజిస్టర్,పలు రికార్డుల రిజిస్టర్లను పరిశీలించారు.  అనంతరం పోషక పక్వాన్,కార్యక్రమంలో పాల్గొని బాలింతలతో మాట్లాడుతూ పోషక   పక్వాన్ వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విట్టా బాయి,విజయలక్ష్మి, మోచి ప్రేమల,గుర్రపు సువర్ణ,ఆయాలు మాణిక్యమ్మ,మల్లమ్మ,
లలిత,బాలింతలు, పిల్లలు,తదితరులు పాల్గొన్నారు.