ఫుల్లుగా మందు కొట్టి పెళ్లి పీటలపైన నిద్రపోయిన పెళ్లి కొడుకు ( వీడియో చూస్తే మామూలుగా నవ్వరు ).

జనం న్యూస్: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో జరిగే ఈ వేడుక కోసం వధూవరులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పెళ్లిపనులు మొదలైన నాటి నుండి కళ్యాణ ఘడియ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్‍తో ఉంటారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లి పీటల మీదే కొన్ని పెటాకులు అవుతున్నాయి. పెళ్లి తంతు ముగిసే వరకు ఆ పెళ్లి జరుగుతుందా లేదా అని డౌటు పడాల్సిందే. మొన్న కట్నం చాలలేదని భద్రాద్రి గూడెం జిల్లా అశ్వారావు పేటకు చెందిన పెళ్లికుమార్తెనే పెళ్లి ఆపేసిన ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో పెళ్లి కుమార్తె కూడా వరుడు ప్రవర్తన కారణంగా పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. అసోంలోని నల్ బరి పట్టణంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. అయితే తన పెళ్లి అని మర్చిపోయాడో ఓ పెళ్లికుమారుడు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. పెళ్లి మండపంలోనే తూలుతున్నాడు. అతడి వెర్రి చర్యలు చూసి బంధువులు సైతం నోరెళ్ల బెట్టారు. కళ్యాణ వేదికపై కునుకు తీశాడు. పెళ్లి మండపంలోనే విచిత్రంగా ప్రవర్తిస్తూ వధువుకు అడ్డంగా దొరికేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వధువు పెళ్లిని పీటల నుండి లేచి వెళ్లిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రసేన్‌జీత్‌ హలోయ్‌ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. భారీగా ఏర్పాటు జరిగాయి. పెళ్లి రోజు రానే వచ్చేసింది. పెళ్లి వేదిక వద్దకు ఊరేగింపుగా రావడానికి ముందు వరుడు హలోయ్ ఫుల్లుగా మద్యం సేవించాడు. పెళ్లి పీటలపై పురోహితుడు పూజలు చేయించేందుకు ప్రయత్నించగా.. మద్యం మత్తులో ఉన్న వరుడు జోగుతూ కనిపించాడు. వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. చివరకూ పెళ్లి పందిట్లోనే నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు శాయ శక్తులా ఈ పెళ్లి చేయాలని ప్రయత్నించారు. అతడి వాలకాన్నిచూసిన వధువు పెళ్లి పీటలపై కూర్చొకూడదని నిర్ణయం తీసుకుంది. వరుడే కాదూ అతడి తరఫు వచ్చిన వారిలో 95 శాతం మంది బంధువుల అందరూ మద్యం సేవించి ఉన్నారు. గొడవ కూడా జరగడంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు పరిహారం చెల్లించాలంటూ వరుడి కుటుంబాన్ని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.